తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల

by Dishafeatures2 |
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు గవర్నర్ తమిళిసై తో శనివారం షర్మిల భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా వాస్తవ పరిస్థితులను గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వరకు అంతా గూండాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఓ నియంత పాలిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 2023ను ఎన్నికల ఏడాదిగా పేర్కొన్న షర్మిల.. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ హింసను ప్రేరేపిస్తోందని, ఎన్నికలు సజావుగా జరగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు షర్మిల చెప్పారు. తన విన్నపాన్ని సావధానంగా ఆలకించిన గవర్నర్.. ఈ విషయంలో చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు.

Next Story

Most Viewed