శారీలో రీల్స్ చేసీ చేసీ ఆర్జీవి కంటపడిన బ్యూటీ.. ఆ పనికోసం ఎంతో కష్టపడ్డానంటూ..

by Javid Pasha |
శారీలో రీల్స్ చేసీ చేసీ ఆర్జీవి కంటపడిన బ్యూటీ.. ఆ పనికోసం ఎంతో కష్టపడ్డానంటూ..
X

దిశ, సినిమా : ఆమె ఒకప్పుడు సాధారణ యువతి. ఏదో టైంపాస్‌కు ఇన్‌స్టా రీల్స్ చేసుకునేది. అలా అందరూ చేస్తుంటారు కదా ఇందులో పెద్ద చెప్పుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఓ స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఆ యుతి కేవలం శారీలో మాత్రమే రీల్స్ చేసేది. దానికితోడు ఆమె అందం, హావ భావాలు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇంకేముంది చూస్తుండగానే ఫాలోవర్లు పెరిగిపోయారు. సరిగ్గా ఇక్కడే ఆమె గ్లామర్ లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తున్న హీరోయిన్ శ్రీలక్ష్మీ సతీష్‌.

శారీలో రీల్స్ చేస్తూ.. చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న శ్రీలక్ష్మీ సతీష్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకూడా ఫాలో అవడం మొదలు పెట్టాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా వర్మ ఇంట్రెస్ట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇంకేముంది ఆర్జీవి చీర భామగా, ‘ఆరాధ్య దేవి’గా శ్రీలక్ష్మీ సతీష్‌‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె చీరకట్టుకు ఫిదా అయిన ఆర్జీవి ఏకంగా ఆమెతో ‘శారీ’ మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ కంటిన్యూ అవుతోంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలక్ష్మీ సతీష్ రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డాక తన పేరును ఆరాధ్య దేవిగా మార్చుకుంది. అదే పేరుతో ప్రస్తుతం అందరినీ అలరిస్తోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను, ఫొటో షూట్‌లను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించిన ఆరాధ్యదేవి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ఓ నెటిజన్ ‘నీ ఏజ్ ఎంత?’ అని అడగ్గా 22 అని బదులివ్వడంతోపాటు తన హైట్ 5 ఫీట్ల 8 ఇంచెస్ అని, తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని, ప్రజెంట్ హైదరాబాద్‌లోనే శారీ మూవీ షూటింగ్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఓ యువకుడు నీ కర్వ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అదే నీలోని అసలైన గ్లామర్ అని కామెంట్ చేయగా.. ‘నా వంపు సొంపులు అంత ఈజీగా వచ్చినవి కావు. వాటికోసం చాలా కష్టపడ్డాను. ఒకప్పుడు నా మీద బాడీ షేమింగ్ ట్రోల్స్ వచ్చాయి. అప్పుడు అలా చేసినవారే ఇప్పుడు నన్ను పొగిడేస్తున్నారు’ అని తెలిపింది ఆరాధ్య దేవి. ప్రజెంట్ ఆమె శారీ ఫొటోలు, శారీ మూవీకి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story