కింగ్ కోబ్రాలతో కబడ్డీ ఆడుకున్న కోతి.. ఆఖరికి ఏమైందంటే? (వీడియో)

by Kavitha |
కింగ్ కోబ్రాలతో కబడ్డీ ఆడుకున్న కోతి.. ఆఖరికి ఏమైందంటే? (వీడియో)
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక అందులో పాముకి సంబంధించిన వీడియోలు అయితే మరీను. ప్రపంచంలో ఏ జంతువైనా సరే తనకు ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే చాలా జాగ్రత్త పడతాయి. సాధుజంతువులైనా సరే ప్రమాదం ఉందని గమనిస్తే వాటి ఒరిజినాలిటీ బయటకు తీసి క్రూరమృగంలా మారిపోతాయి. ఎదురుగా ఎంత పెద్ద జంతువైనా సరే పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

కింగ్ కోబ్రా టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియో అప్‌లోడ్ అయింది. ఆ వీడియోలో ఒక కోతి మెడకు చైన్ కట్టేసి అటు పక్కగా ఉంచారు. అక్కడే ఫ్లోర్‌పై రెండు నాగుపాములు ఉన్నాయి. అవి నల్లగా భయంకరంగా పడగవిప్పి బుసలు కొడుతూ ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరికో బాగా మూడింది అన్నట్టుగా.. ఒక్క కాటుతో చంపేద్దామా అన్నట్టు ఉన్నాయి.

అటువంటి సిట్యూవేషన్‌లో ఓ కోతి వాటితో కబడ్డీ ఆడుకుంది. మధ్యలోకి జంప్ చేస్తూ ఆ రెండు పాముల తోక పట్టుకుని లాగుతూ ఆటలాడుతుంది. నాగుపాము కోపంతో దానిపై దాడి చేస్తుండగా కోతి మాత్రం ఏమి తెలియనట్టుగా పామును చంటిపిల్లాడిలా భావించి.. చేతితో దగ్గరకు తీసుకున్నది. కానీ చివరికి ఆ రెండు పాములు కోతిని కాటేసాయి. కానీ కోతికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.16 సెకనుల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. మరి మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి..

Next Story