Eluru: ఆ జిల్లాలో వింత రోగాలు.. భయాందోళనలో ప్రజలు

by Indraja |
Eluru: ఆ జిల్లాలో వింత రోగాలు.. భయాందోళనలో ప్రజలు
X

దిశ వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రమస్తులను దీర్ఘకాలిక రోగాలు కలవర పెడుతున్నాయి. విషజ్వరాలు, చర్మంపై మచ్చలు, నొప్పులతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. నెలల తరబడి రోగాల బారిన పడి ఇంబ్బందులను ఎదర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వక్యం చేస్తున్నారు. ఎన్ని మందులు వాడిన ఫలితం శూన్యం అని వాపోతున్నారు.

రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు తమవని, అయితే రోగాల బారిన పడి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వచ్చామని, తమకి నిత్యవసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. అయనా రోగులు పెరుగుతున్నారేగాని తగ్గడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో గ్రమస్తుల రక్త నమూనాలను, నీరుని పరీక్షలకు పంపించామని, రిపోర్టులు వస్తే వాటిని చూసి మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. కలుషిత నీరే రోగాలకు కారణమైఉండోచ్చు అని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story