75 ఏళ్లు గడిచినా అంబేద్కర్ కల నెరవేరలే.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

by Dishafeatures2 |
75 ఏళ్లు గడిచినా అంబేద్కర్ కల నెరవేరలే.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా అంబేద్కర్ కల నెరవేరలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. దళితులు, బలహీనవర్గాల వారు ఇంకా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ చిన్ననాటి నుంచే కులవివక్షను ఎదుర్కొన్నారన్నారు. నాడు రెండు గ్లాసుల పద్ధతిని అమలు చేస్తూ దళితులను తీవ్రంగా అవమానించేవారన్నారు. దళితులకు జరుగుతున్న ఈ అవమానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడాడని చెప్పారు. పెత్తందారి వ్యవస్థను ఎదిరిస్తూ బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలబడ్డాడన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించి 10 సంవత్సరాల కాలంలోనే దళితుల అభ్యున్నతి జరగాలని అంబేద్కర్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగా నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కేంద్రంగా నాటిన ఐటీ అనే విత్తనం మహావృక్షమై నేడు లక్షలాది మందికి ఉద్యోగ ఫలాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, తిరునగరి జ్యోత్స్న, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, రాష్ట్ర పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బోస్, రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, జాటోతు ఇందిర, షకీలా రెడ్డి, వేజెండ్ల కిశోర్ బాబు, సూర్యదేవర లత, లీలాపద్మావతి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed