బీఆర్ఎస్ ను పంచభూతాలు పగబట్టాయి.. బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి

by Disha Web Desk 14 |
బీఆర్ఎస్ ను పంచభూతాలు పగబట్టాయి.. బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ను పంచభూతాలు పగబట్టాయని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి విమర్శలు చేశారు. వారు చేసిన ప్రతీ తప్పు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను పూర్తిగా హరిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యూ న్యూస్ చానెల్ కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది పింకీ లు దౌర్జన్యంగా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.

నిందితులను ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు మీద తప్పు చేసి బీఆర్ఎస్ నాయకులు వాళ్ల కాళ్లపై వారే వాళ్ళే గొడ్డలి కొట్టుకుంటున్నారన్నారు. తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ, రేప్ కేసులు, దొంగతనం, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, లిక్కర్ కేసు వంటి ఏదో ఒక అంశం బీఆర్ఎస్ ను వెంటాడుతోందని, పంచభూతాలు కూడా వారికి వ్యతిరేకంగా మారాయనేందుకు ఇవి నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు.

Next Story