Sonia Gandhi: పాఠ్యపుస్తకాల్లో మతప్రభావం పెరుగుతోంది: సోనియా గాంధీ

by Prasad Jukanti |

నూతన జాతీయ విద్యావిధానంపై సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.

Sonia Gandhi: పాఠ్యపుస్తకాల్లో మతప్రభావం పెరుగుతోంది: సోనియా గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (National Education Policy 2020) వాస్తవాలకు విరుద్ధంగా ఉందని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. విద్యావ్యవస్థను వ్యాపారమయం చేస్తున్నారని ఆరోపించారు. పాఠపుస్తకాలు, విద్యాసంస్థల్లో మత ప్రభావం (Communalisation of textbooks) పెరుగుతోందని ఇవన్నీ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయన తాజాగా ఓ జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను వెంటాడుతున్న మూడు అంశాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రీకృతంగా ఉన్న విద్యావ్యవస్థపై కేంద్రానిదే పెత్తనం అని పేర్కొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రాలకు రావాల్సిన గ్రాంట్ లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేచయడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యంత అవమానకరమైన చర్యల్లో ఒకటి అని ధ్వజమెత్తారు.

Next Story