కేసీఆర్, జగన్‌పై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్, జగన్‌పై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని చెప్పి చేయలేదన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అదేదో మాతో జత కట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే ఇద్దరే ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ సాధించేదా అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ బతికే ఉందని, తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కష్టపడుతున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పాదయాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ నేత వైఎస్ కొడుకనే ప్రజలు ఆయనను ఆదరించారని అన్నారు. కేసులు పెట్టామనే ఆయన కాంగ్రెస్‌ను వీడిపోయారని అన్నారు. గులాం నబీ ఆజాద్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆయనకు కాంగ్రెస్ చేయనిదంటూ ఏమీ లేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన పార్టీని వీడారని అన్నారు. అధికార దాహంతోనే ఆయన రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్న గులాం నబీ ఆజాద్ తాను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండాలని కోరాడని అన్నారు. పదవుల కోసం ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాహుల్ గాంధీ పదవులు కోరుకుంటే ఆయన యూపీఏ 1, యూపీయే 2లో కనీసం మంత్రి పదవి అయినా తీసుకునే వారని కానీ, అలా చేయలేదని చెప్పారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు.


Next Story

Most Viewed