దళితబంధు స్కీమ్: సీఎం కేసీఆర్ మరో గుడ్ న్యూస్

by Disha Web Desk |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 100 మందినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండగా ఇకపై ఆ సంఖ్యను పెంచుతూ కేసీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గంలో పరిమిత సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందరికి ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఈ స్కీమ్‌ను కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇకపై నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకం వర్తింప చేసేలా ప్రక్రియను కొనసాగించాలని సీఎం అధికారులకు సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇవాళ ప్రగతి భవన్‌లో పలు అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించిన ముఖ్యమంత్రి గతంలో మాదిరే నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరపాలని నిర్ణయించారు. వేసవి ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గం.లకు ప్రారంభించి, త్వరగా ముగించాలన్నారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో మరియు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలని, ఈ ప్రసంగాలను కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తయారుచేయాలన్నారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని అన్నారు


Next Story

Most Viewed