భారతీయ రాజుకు అవమానం.. కేంద్రానికి MLC కవిత లేఖ

by Disha Web Desk 2 |
భారతీయ రాజుకు అవమానం.. కేంద్రానికి MLC కవిత లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశాన్ని పరిపాలించిన ఓ రాజుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఆసక్తిని రేపుతోంది. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని తప్పును సరిదిద్దేలా చేయాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు కవిత లెటర్ రాశారు. దీంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉబ్బెకిస్థాన్ మ్యూజియంలో భారత్‌కు చెందిన రాజా సవాయి జైసింగ్‌ను బాబర్‌కు సేవకునిగా అభివర్ణించారు. ఈ విషయం తన మిత్రుల ద్వారా తనకు తెలిసిందని కవిత పేర్కొంటూ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సవరించేలా చూడాలని అన్నారు. గొప్ప రాజుల్లో ఒకరైన సవాయి జైసింగ్‌ను విదేశాల్లో ఇలా సేవకునిగా పేర్కొనడం మన దేశ గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించారు. ఉబ్బెకిస్తాన్ వారికి అవసరమైన మార్పుల కోసం వారితో చర్చించవలసిందిగా డిమాండ్ చేశారు.

మా చారిత్రక వ్యక్తులందరినీ భాహ్య ప్రపంచంలో తగిన గౌరవంతో సంబోధించాలని మేము కోరుకుంటున్నామని కవిత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, జైసింజ్ 2 సవాయి జై సింగ్‌గా ప్రసిద్ధికెక్కాడు. ఇతను అంబర్ రాజ్యానికి చెందిన 29వ కచ్వాహా రాజ్‌పుత్ పాలకుడు. అతను జైపూర్ కోటను స్థాపించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తన తండ్రి రాజా బిషన్ సింగ్ 31 డిసెంబర్ 1699న మరణించిన తర్వాత 11 ఏళ్ల వయస్సులో అంబర్‌ను పాలించేందుకు గద్దెనెక్కాడు. ప్రారంభంలో, జై సింగ్ మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా పనిచేశాడు. డెక్కన్‌లోని ఖేల్నా ముట్టడికి ముందు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అతనికి సవాయి బిరుదును ఇచ్చాడు. పాలనలో తర్వాతి రోజుల్లో జై సింగ్ మొఘల్ ఆధిపత్యం నుండి విముక్తి పొంది సార్వభౌమత్వాన్ని సాధించాడు. అనేక శతాబ్దాలుగా విస్మరించబడుతున్న పురాతన ఆచారమైన అశ్వమేథ యాగాన్ని నిర్వహించాడు. ఇతను 1734లో ఒకసారి, 1741లో రెండుసార్లు అశ్వమేథ యాగాలు చేశాడు.అలాగే జై సింగ్‌కు గణితం, వాస్తుశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంలో చాలా ఆసక్తి ఉంది. అతను తన రాజధాని జైపూర్‌తో సహా భారతదేశంలోని అనేక ప్రదేశాలలో జంతర్ మంతర్ అబ్జర్వేటరీలను ప్రారంభించాడు.ఇతను యూక్లిడ్ యొక్క 'ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ' ని సంస్కృతంలోకి అనువదించాడు. కాగా రాజా జైసింగ్ ను బాబర్ కు సేవకునిగా అభివర్ణించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెంటే ఈ తప్పును సవరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు సైతం కోరుతున్నారు.


Next Story

Most Viewed