- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ, కరీమాబాద్ : వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో ఓ వ్యక్తికి ఫిట్స్ వచ్చి మూడు అంతస్తుల భవనంపై నుంచి పడిపోవడంతో, గమనించిన స్థానికులు 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. 100 కాల్ సమాచారం అందుకున్న మట్టేవాడ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ రావు, కానిస్టేబుల్ రామనకర్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. భవనంపై నుంచి పడి స్పృహ తప్పి ఉన్న అంగీరక్ రాజు అనే వ్యక్తిని భుజం పై మోసుకుంటూ భవనం కిందికి తీసుకువచ్చారు. భవనం ఇరుకుగా ఉండడంతో పోలీస్ సిబ్బంది సాహసం చేసి కిందికి తీసుకువచ్చారు. వెంటనే స్థానికుల సహాయంతో రాజును చికిత్స నిమిత్తం ఎంజీఎం కి తరలించారు. మూడు అంతస్తుల భవనం పై నుంచి బాధితున్ని భుజాలపై మోసుకొచ్చి ప్రాణాపాయం నుంచి కాపాడిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Next Story