కేటీఆర్ మాటను కొట్టిపారేస్తున్న పోలీసులు

by  |
కేటీఆర్ మాటను కొట్టిపారేస్తున్న పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కలకలం సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు కొలిక్కి రావడం లేదు. నిందితుడైన రాజును పట్టుకునేందుకు 9 పోలీసు బృందాలతో హైదరాబాద్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే రాజు తల్లి, అక్కాబావలను ప్రశ్నించిన పోలీసులు, రాజు తప్పించుకునేందుకు స్నేహితుడు సహాయం చేసినట్లు గుర్తించారు. దీంతో స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని పట్టుకుంటే ఏ పోలీసు స్టేషన్ లో ఉన్నారు. జస్టిస్ ముందు హాజరు పరిచారా?.. ఎన్ని రోజులు రిమాండ్ విధించారు. ఒకవేళ అరెస్టు చేసినా.. 24 గంటల్లో జస్టిస్ ముందు ఉంచాలని చట్టం ఉంది కదా..” అంటూ కేటీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే నిందితుడిని పట్టుకున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు.

Next Story

Most Viewed