లాయర్ల హత్య కేసులో పోలీసుల కీలక అడుగు

by  |
లాయర్ల హత్య కేసులో పోలీసుల కీలక అడుగు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు అడ్వొకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికైనా అరెస్టయిన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ లను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఆ పిటిషన్ లో కోరారు.

ఈ నెల 17వ తేదీన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని దుండుగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. రామగిరి మండల సమీపంలో వామన్‌రావు కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.



Next Story