వరంగల్ వాసులకు అలర్ట్… ట్రాఫిక్ ఆంక్షల వివరాలు ఇవే..

by  |
KCR warangal tour updates
X

దిశ, కాళోజి జంక్షన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈనెల 21న హన్మకొండలో ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ – వడ్డేపల్లి క్రాస్ రోడ్స్ నుండి ఎంజీఎం వరకు వయా కలెక్టరేట్, అదాలత్, కాళోజి జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, సీపీఓ జంక్షన్, అశోకా జంక్షన్, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్డు మీదుగా ఎంజీఎం వరకు ఎటువంటి ట్రాఫిక్ అనుమతించడదని తరుణ్ జోషి తెలిపారు. హైదరాబాద్ నుండి వరంగల్ వైపునకు వెళ్ళే వాహనాలు కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు, పోతన జంక్షన్, అండర్ బ్రిడ్జి, హెడ్ పోస్టాఫీస్ మీదుగా వరంగల్ కు.. హైదరాబాద్ నుండి హన్మకొండ వచ్చు వాహనాలు, మదర్ థెరిస్సా జంక్షన్ నుండి వంద ఫీట్ల రోడ్డు మీదుగా కెయుసి జంక్షన్, పెద్దమ్మగడ్డ మీదుగా వెళ్తాయన్నారు.

హైదరాబాద్ నుండి వచ్చు ఆర్టీసీ బస్సులు, కలెక్టర్ రెసిడెన్సీ మీదుగా సర్క్యూట్ హౌజ్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా బస్టాండ్ కు చేరుకుంటాయి. నగర్ వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సు కేయుసి, సీపీఓ జంక్షన్ నుండి అంబేద్కర్ జంక్షన్ మీదుగా బస్‌స్టాండ్‌కు చేరుకుంటాయి. ములుగు వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ పెద్దమ్మగడ్డ మీదుగా కేయూసి జంక్షన్, సీపీఓ జంక్షన్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ నుండి బస్టాండ్ కు రానున్నాయి. వరంగల్ వైపు నుండి వచ్చు ఆర్టీసీ బస్సు, ట్రాఫిక్ ఎంజీఎం మీదుగా పోతన జంక్షన్, హంటర్ రోడ్డు, అదాలత్ మీదుగా కాళోజి జంక్షన్, బాలసముద్రం మీదుగా బస్టాండ్ కు వెళ్తాయి. హన్మకొండ నుండి వరంగల్ వెళ్లు వాహనాలు కేయూసి జంక్షన్ మీదుగా పెద్దమ్మగడ్డ, హనుమాన్ జంక్షన్ మీదుగా పోచమ్మ మైదాన్ వైపు ట్రాఫిక్ మళ్లీంచబడుతుందని తరుణ్ జోషి పేర్కొన్నారు. వడ్డేపల్లి క్రాస్ రోడ్డు నుండి ఎంజీఎం వరకు గల ప్రధాన రహదారిపై ఉన్న వాణిజ్య సముదాయాల ముందు ఎటువంటి పార్కింగ్‌కు అనుమతి లేదన్నారు.



Next Story