ఆ యాత్రికుల కోసం వేట మొదలైంది

by  |
ఆ యాత్రికుల కోసం వేట మొదలైంది
X

దిశ, కరీంనగర్: ఢిల్లీ మర్కజ్ మసీదు వద్ద జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి కోసం పోలీస్ శాఖ వేట మొదలు పెట్టింది. ఓ వైపున ఇంటలిజెన్స్, మరోవైపు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభలకు హాజరయ్యారని గుర్తించిన అధికారులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఏరియాల వారీగా జాబితా..

కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో విచారణ ముమ్మరం చేశారు. కరీంనగర్‌కు చెందిన 9 మందిని గుర్తించి అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించారు. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారిని కూడా ఇప్పటికే గుర్తించిన అధికారులు వీరిని క్వారంటైన్ కు పంపించేందుకు ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏరియాల వారిగా జాబితా తయారు చేస్తున్న నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగానికి పంపిస్తున్నాయి. వారిని వెంటనే క్వారంటైన్ కు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే ఐసోలేషన్ కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కేవలం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే కాకుండా వారు ఇక్కడకు వచ్చిన తరువాత స్థానికులను ఎంతమందిని కలిశారో కూడా తెలుసుకుని వారిపై నిఘాపెట్టినట్టు తెలుస్తోంది.

మసీద్ కు వెళ్లి ఉంటారేమో..

ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన కోరుట్ల వాసులను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. వీరు అజ్మీర్ దర్గాకు వెళ్లి వస్తున్నామని సమాచారం ఇచ్చారు. వీరు కూడా మర్కజ్ మసీదుకు వెళ్లి ఉంటారనే అనుమానం వచ్చింది. దీంతో జగిత్యాల జిల్లా పోలీసులు ఓ టీం వారిని విచారించేందుకు ఆదిలాబాద్ సరిహద్దులకు పంపించినట్టు సమాచారం. సరుకులు రవాణా చేసే వాహనంలో వీరు రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేయగా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలువరించారు. వారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు.

గ్రామాలపై నజర్..

గతంలో ఇలాంటి ప్రార్థన సభలకు పట్టణ ప్రాంతాలకు చెందిన వారే వెళ్లే వారని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా వెళ్లినట్టు అధికారులు గుర్తించగా ఇప్పుడు అధికారుల కన్నఆవైపు కూడా పడింది. ఏదైమైనా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

Tags: police,checkposts,corona suspect



Next Story

Most Viewed