ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు వేగవంతం

by  |
ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు వేగవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటనపై స్పెషల్ సెల్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఓ క్యాబ్‌లో నుంచి ఇద్దరు వ్యక్తులు ఎంబసీ వైపు నడిచివెళ్తున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులను ఎంబసీ వద్ద దించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు కాంటాక్ట్ అయ్యారు. అతని వద్ద నుంచి ఇద్దరు వ్యక్తుల స్కెచ్‌లను తయారు చేస్తున్నారు.

ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన పేలుడు ధాటికి పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి 1.4 కిలోమీటర్ల దూరంలో పేలుడు జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. ఘటనాస్థలిలో బాల్ బేరింగ్స్, లెటర్ లభ్యమైంది. ఐఈడీ బాంబును నాటు పద్దతిలో తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



Next Story

Most Viewed