ఉద్యోగుల తొలగింపులు ఉండవు : పీఎన్‌బీ

by  |
ఉద్యోగుల తొలగింపులు ఉండవు : పీఎన్‌బీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)తో విలీనం చేయడం వల్ల ఉద్యోగుల తొలగింపులు ఉండవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ ఎస్ మల్లికార్జున రావు తెలిపారు. ఈ మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ 2020, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు బ్యాంకుల విలీనం వ్యాపారం, బ్రాంచ్ నెట్‌వర్క్ పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద జాతీయ బ్యాంకుగా మారింది.

ఈ విలీనం అనంతరం పోటీ పెరుగుతుందని, నెక్స్ట్ జనరేషన్ బ్యాంకుగా, పీఎన్‌బీ 2.0 గా మారనుందని బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్లు విలీన ప్రక్రియ పూర్తయిన వెంటనే పీఎన్‌బీ కస్టమర్లుగా పరిగణించబడతారని పేర్కొంది. ఇక, విలీనం తర్వాత పీఎన్‌బీ 2.0 వ్యాపార విలువ రూ. 17.95 లక్షల కోట్లుగా ఉండనుంది. ఇది విలీనానికి ముందు పీఎన్‌బీకి కనీసం 1.5 రెట్లు అని బ్యాంక్ తెలిపింది.



Next Story