- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పరిస్థితులపై పీఎం సమీక్ష
<p>న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలు, జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి వివరాలను అధికారులు పీఎంకు తెలియజేశారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాలపై చర్చించారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనను పెంచే విధానాలను వివరించారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు, ఔషధాలు ఏ మేరకు అందుబాటు ఉన్నాయో మోడీ సమీక్షించారు. రెమ్‌డెసివిర్ సహా ఇతర ప్రాణాధార ఔషధాల ఉత్పత్తి […]</p>

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలు, జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి వివరాలను అధికారులు పీఎంకు తెలియజేశారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాలపై చర్చించారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనను పెంచే విధానాలను వివరించారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు, ఔషధాలు ఏ మేరకు అందుబాటు ఉన్నాయో మోడీ సమీక్షించారు. రెమ్‌డెసివిర్ సహా ఇతర ప్రాణాధార ఔషధాల ఉత్పత్తి వేగాన్ని పెంచినట్టు ప్రధానికి వివరించారు. వ్యాక్సినేషన్ పురోగతిని, టీకా ఉత్పత్తి పెంపు కోసం నిర్ణయించిన చర్యలను పీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, డాక్టర్ హర్షవర్ధన్, పియూష్ గోయల్, మన్‌సుఖ్ మాండవియాలతో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






