వృక్షాలు లేకపోతే.. మానవాళికి మనుగడ లేదు

by  |
వృక్షాలు లేకపోతే.. మానవాళికి మనుగడ లేదు
X

దిశ, జుక్కల్:
భావితరాలు మనుగడ సాధించాలంటే, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం పిట్లం మండలం మంగలూరులో ఆరో విడత హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా మొక్కల సంరక్షణ చేపట్టాలని సూచించారు. వృక్షాలు లేకపోతే సమస్త జీవరాశులకు మనుగడ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరు విడతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మొక్కలు నాటారు. వృక్షాలు లేకపోతే భావితరాలు ప్రాణవాయువును కొనుగోలు చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని అన్నారు.



Next Story

Most Viewed