ఫైజర్ వెనకడుగు

by  |
ఫైజర్ వెనకడుగు
X

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ టీకా వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ శుక్రవారం ప్రకటించింది. బ్రిటన్, బహ్రెయిన్ దేశాలు ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి మొదట అనుమతి ఇచ్చాయి. ఆ తర్వాత భారత్‌లో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఫైజర్ దరఖాస్తు చేసుకుంది. దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఫైజర్ కావడం గమనార్హం. ఈ నెల 3న భారత ఔషధ నియంత్రణ సంస్థ‌ నియమించిన నిపుణుల కమిటీ ఎదుట ఫైజర్‌కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

ఃసమావేశంలో చర్చకు వచ్చిన విషయాలను పరిశీలించిన తర్వాత ఔషధ నియంత్రణ సంస్థకు అదనపు సమాచారం సమర్పించాల్సి ఉన్నట్లుగా అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో దరఖాస్తును ఉపరసంహరించుకోవాలని సంస్థ నిర్ణయం తీసుకున్నది అని ఫైజర్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత్ ఔషధ నియంత్రణ సంస్థతో ఫైజర్ సంప్రదింపులు కొనసాగిస్తుందని, సమీప భవిష్యత్తులో అదనపు సమాచారం అందుబాటులోకి రాగానే మరోసారి దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed