పీఎఫ్​ ఖాతాదారుల ఆధార్ అనుసంధానానికి ఆగష్టు 31 వరకే గడువు

by  |
పీఎఫ్​ ఖాతాదారుల ఆధార్ అనుసంధానానికి ఆగష్టు 31 వరకే గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పీఎఫ్‌ చందాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. యూఏఎన్‌ నంబర్‌తో తమ ఆధార్‌ను అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ, దీనికి ఆగష్టు 31 వరకు గడువును ఇచ్చింది. ఆధార్‌ను జత చేయకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పీఎఫ్ సేవలు పొందడానికి అవకాశం ఉండని స్పష్టం చేసింది. గడువులోపు ఆధార్ జత చేయకపోతే కంపెనీలు పీఎఫ్ జమ చేయడం, చందాదారులు పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదని తెలిపింది.

సోషల్ సెక్యూరిటీ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ మే మొదటివారం కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈపీఎఫ్‌కు ఆధార్ జత చేసేందుకు జూన్ 1 వరకు గడువు ఇచ్చింది. తాజాగా దీన్ని ఈ నెల చివరికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ఉంటే మరోసారి ధృవీకరించుకోవాలని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. చేసుకోని వారు ఈపీఎఫ్ వెబ్‌సైట్‌లో పేరు, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి కేవైసీ పూర్తి చేయాలి. అందులో ఈపీఎఫ్‌తో ఆధార్ అనుసంధానం ఎంచుకుని ఆధార్ కార్డులోని వివరాలను పొందుపర్చాలి.


Next Story

Most Viewed