- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని లాక్కెళ్లి.. కత్తులతో పొడిచి..!
by Sridhar Babu |
<p>దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిమ్మగూడెం గ్రామానికి చెందిన జాడీ ప్రవీణ్(36) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ప్రవీణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి లాక్కెళ్లి పంటపొలాల సమీపంలో కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు విగతజీవిగా పడి ఉన్న ప్రవీణ్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి […]</p>

X
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిమ్మగూడెం గ్రామానికి చెందిన జాడీ ప్రవీణ్(36) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ప్రవీణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి లాక్కెళ్లి పంటపొలాల సమీపంలో కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు విగతజీవిగా పడి ఉన్న ప్రవీణ్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాటారం సీఐ హతిరామ్, మహాముత్తారం ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






