నేను జోక్ చేయడం లేదు.. నిజంగానే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసి మరీ..!

164

దిశ, జవహర్ నగర్ : సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ బిక్షపతి రావు కథనం ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ మోహన్ రావు నగర్ కాలనీలో దండెం మల్లేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు దండెం అశోక్ (27) సంవత్సరాలు. మూడేళ్ల కిందట మానసతో అతనికి వివాహం జరిగింది. అశోక్ ఆన్లైన్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటలకు అశోక్ విధులకు వెళ్లగా అతని తల్లిదండ్రులు, భార్య నగరంలోని ఆసిఫ్ నగర్‌లో బంధువుల వివాహానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే అశోక్ సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్యకు చేసుకున్నాడు. వీడియోలో.. నేను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా.. నమ్మడం లేదు కదా.. ఇదిగో చూడు అంటూ వీడియో రికార్డు చేశాడు. ఇది కూడా బ్లాక్ చేసుకో.. ఇదే చివరిది.. నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటూ వీడియోలో మాట్లాడినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి చూడగా అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు.అప్పటికే మృతుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోను స్నేహితుడికి పంపించాడు. ఫోన్ లాక్‌చేసి ఉండటంతో అశోక్ మృతికి గల పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు సీ0ఐ బిక్షపతి రావు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..