జల్లికట్టుకు లైన్ క్లియర్.. కండిషన్స్ అప్లై!

42

దిశ, వెబ్‌డెస్క్ : జల్లికట్టును తమిళనాట ఓ క్రీడగా కంటే సాంప్రదాయంగానే భావించడానికి అక్కడి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రీడా చాలా డేంజర్. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాల మీదకు వస్తుంది. గతంలోనూ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అప్పట్లో దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించినా.. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఎలా నిషేధిస్తారంటూ తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ దేశ అత్యున్నత స్థానం తీర్పు మేరకు ఏటా జల్లికట్టు నిర్వహణ జరుగుతోంది.

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో జల్లికట్టును నిషేధించాలని భావించినా అది జరగలేదు. తాజాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రమాదకర ఎడ్ల పరుగు పందేలు నిర్వహించుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ప్రధానంగా తిరుచ్చి, పుదుకొట్టై, వెల్లటూర్, తిరుప్పూర్ జిల్లాలో జల్లికట్టు పోటీలను నిర్వహించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, కరోనా జాగ్రత్తలు అందరూ తప్పక పాటించాలని షరతులు విధించింది. ప్రభుత్వం నిర్ణయంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.