చిన్న వ్యాపారులకు పేటీఎం రుణాలు!

by  |
చిన్న వ్యాపారులకు పేటీఎం రుణాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం 2021, మార్చి నాటికి వ్యాపారులకు రూ. వెయ్యి కోట్ల రుణాలను అందజేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. వ్యాపారులకు రూ. 5 లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నట్టు సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 550 కోట్ల రుణాలను ఇచ్చామని, ప్రస్తుతం దీనికి రెట్టింపు స్థాయిలో రుణాలివ్వాలని లక్ష్యంగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ రుణాలు 1 శాతం నుంచి 2 శాతం మధ్య వడ్డీ రేట్లతో రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఇవ్వనున్నట్టు వివరించింది. తమ వద్ద ఉన్న మొత్తం 1.7 కోటిమంది వ్యాపారుల డేటా ఆధారంగా రూ.వెయ్యి కోట్ల రుణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

బ్యాంకుల నుంచి రుణాలను పొందలేని కిరాణా స్టోర్స్, ఇంకా ఇతర చిన్న చిన్న వ్యాపారులకు సాయంగా ఈ రుణాలను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ రుణాల ద్వారా వారు తమ వ్యాపారాలను డిజిటలైజ్ చేసుకునేందుకు, వ్యాపారాలను విస్తృతం చేసుకునేందుకు ఉపయోగపడతాయని పేటీఎం సంస్థ తెలిపింది. పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఎటువంటి పూచికత్తు లేని రుణాలని అందించనున్నట్టు చెప్పింది. ఈ రుణాలు డిజిటల్ ఇండియా కార్యక్రమానికి దోహదపడతాయని పేటీఎం అభిప్రాయపడింది.

Next Story

Most Viewed