పెరిగిన పేటీఎమ్ ఆదాయం

by  |
పెరిగిన పేటీఎమ్ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం (paytm) మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 3,629 కోట్లకు పెరిగిందని శుక్రవారం వెల్లడించింది. వివిధ సెగ్మెంట్లలో పెరిగిన లావాదేవీల కారణంగానే ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ నష్టాలు 40 శాతం తగ్గాయని పేర్కొంది.

భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామని, లక్షలాది మంది భారతీయులు డిజిటల్ సేవల్లోకి రావడానికి ప్రోత్సహిస్తున్నామని, తమ వ్యాపార భాగస్వాముల కోసం డిజిటల్ సేవలని మరింత పటిష్టంగా నిర్మించడానికి భారీగా పెట్టుబడులను పెడుతున్నట్టు పేటీఎం అధ్యక్షుడు మధుర్ డియోరా ఓ ప్రకటనలో తెలిపారు.

ఆర్థిక సేవలు, పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా నమోదైన వృద్ధి కారణంగా ఖర్చులు తగ్గాయని, దీంతో గతేడాదితో పోలిస్తే నష్టాలు 40 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. 2022 నాటికి లాభదాయకతలో ఉంటామని, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో పేటీఎం పోస్ట్‌పెయిడ్, పేటీఎం మనీ, పేటీఎం ఇన్సూరెన్స్ సేవలతో డిజిటల్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలను కలిగి ఉంటామని మధుర్ డియోరా వివరించారు.


Next Story

Most Viewed