IPO లపై ప్రభావం చూపిస్తున్న Paytm ఫలితాలు

by  |

దిశ, వెబ్‌డెస్క్ : వరుస నష్టాలతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్స్ పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దాని ఎఫెక్ట్ కమింగ్ IPO లపై కూడా పడింది. మొన్న వచ్చిన PAYTM నష్టాలను తీసుకురావడంతో IPOల భవిష్యత్తుపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటో IPOలకు అంతగా ఆదరణ లభించే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే లిస్ట్ అయిన టార్సన్స్ ప్రోడక్ట్స్ పై కూడా అందరి చూపు ఉంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వా్రా రూ.1024 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఇందులో తాజా ఇష్యూ రూ.150 కోట్లు, 1,32,00,000 ఈక్విటీ షేర్ల అమ్మకానికి ఆఫర్ ఉంటుంది.

IPO ఇష్యూ ధర రూ.635 నుండి రూ. 662. కంపెనీ విషయానికి వస్తే ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్, బయోటెక్, ఆహారం,సెంట్రిఫ్యూజ్ వేర్, క్రయోజెనిక్ వేర్, లిక్విడ్ హ్యాండ్లింగ్, బీకర్‌లు, ట్యూబ్ రాక్‌లు, పర్యావరణ రంగాలలో వంటి ఉత్పత్తులలో అగ్రగామిగా ఉంది. IPO చివరి రోజు నాటికి 77.49 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లను అందుకుంది. GMP (గ్రే మార్కెట్ ప్రీమియం)లో దీని ధర రూ.185 వద్ద ఉంది. అయితే, ఇంతకుముందు రోజుతో పోలిస్తే రూ.5 తక్కువగా ఉంది. అందరి అంచనాలు అందుకుంటూ నవంబర్ 26న మార్కెట్‌లో ఇన్వెస్టర్స్కు లాభాలు ఇస్తుందా? లేక నష్టాలు ఇస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

1.IPO అలోట్ మెంట్‌కు అప్లై చేసిన వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కింద ఇచ్చిన వివరాల ఆధారంగా చూసుకోగలరు.

2.BSE అధికారిక వెబ్‌సైట్‌లో bseindia.com/investors/appli_check.aspx లింక్ ద్వారా టార్సన్స్ ప్రోడక్ట్స్ IPOకి సభ్యత్వం పొందిన బిడ్డర్లు దరఖాస్తు స్థితిని చూసుకొవచ్చు.

3.అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అయిన తర్వాత, టార్సన్స్ ప్రొడక్ట్స్ IPOని ఎంచుకొని పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

4.పాన్ నంబర్ ఇచ్చాకా సెక్యూరిటీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed