బాలయ్య సరసన పాయల్ ?

by  |
బాలయ్య సరసన పాయల్ ?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ … ఒక్క సినిమాతోనే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా తర్వాత ‘ఆర్డీఎక్స్ లవ్‌’లో మరింత హాట్‌గా కనిపించి మతిపోగొట్టింది. ఆ తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో ‘వెంకీ మామ’లో జతకట్టిన ఈ భామ హిందీ టీచర్‌గా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ ‘డిస్కోరాజా’లో మౌనంగానే తన కళ్లతో హావభావాలు పలికించి సూపర్ అనిపించుకుంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్‌లోనూ ఆడిపాడుతున్న ఈ భామ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. అటు సాంగ్స్.. ఇటు మూవీస్‌తో దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే మరో సీనియర్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది పాయల్. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇన్నాళ్లుగా బాలయ్యకు జోడిగా శ్రీయా శరణ్ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అంజలి ఆ పాత్రకు ఎంపికైందనే న్యూస్ హల్ చల్ చేసింది. కానీ వారెవరూ కాదు.. ఇప్పుడు అందాల బొమ్మ పాయల్ బాలయ్య సరసన ఆడిపాడబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. తన గ్లామర్‌ టచ్‌తో మాయచేస్తుందనే పాయల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం జరుగుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారట.

Tags : Payal Rajput, Balakrishna, Balayya, Boyapati



Next Story