నాకు బాధగా ఉంది: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

<p>దిశ ఏపీ బ్యూరో: నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ఎలాంటి అవార్డులు రాకపోవడం తనను బాధిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన ఆయన, నవరసాలను అలవోకగా పండించగల కైకాల సత్యనారాయణ తెలుగునేలపై జన్మించడం తెలుగువారి అదృష్టమని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి అనేకమంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా [&hellip;]</p>

నాకు బాధగా ఉంది: పవన్ కల్యాణ్
X

దిశ ఏపీ బ్యూరో: నవరస నటనా సార్వభౌముడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ఎలాంటి అవార్డులు రాకపోవడం తనను బాధిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన ఆయన, నవరసాలను అలవోకగా పండించగల కైకాల సత్యనారాయణ తెలుగునేలపై జన్మించడం తెలుగువారి అదృష్టమని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి అనేకమంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా సత్యనారాయణ నిలిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. నటనలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు రాకపోవడం బాధను కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.

Next Story