కాంగ్రెస్ ఇచ్చిన ప్రాధాన్యత టీఆర్ఎస్ ఇవ్వడం లేదు : పటేల్ రమేష్ రెడ్డి

by  |
PCC Secretary Patel Ramesh Reddy
X

దిశ, సూర్యాపేట: మూసీ ప్రాజెక్టు గేట్లను ప్రభుత్వం తక్షణమే ఆధునీకరించాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మూసీ గేట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రాజెక్టు విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ప్రాధాన్యత టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిచడం లేదని ఆరోపించారు. రెయిలింగ్, గేట్లకు గ్రీసింగ్ కూడా కనీసం చేయడం లేదని, దీనిపై అధికారులను సంప్రదిస్తే బిల్లులు రావడంలేదని అంటున్నారని వెల్లడించారు.

ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. వేలాది ఎకరాలకు సాగునీటి అవసరాలకు ఉపాధిని కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టుపై ఎంతోమంది మత్స్యకారులు ఆధారపడి ఉన్నారని అన్నారు. భావితరాలకు ఉపయోగపడే మూసీ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించి, ఆధునీకరించాలని, లేకపోతే మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సర్పంచ్ మండల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి రమణా రెడ్డి, గట్టు శ్రీను, పాలవరపు వేణు, బంటు చొక్కయ్య గౌడ్, ఎండీ షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, నామా ప్రవీణ్, పిల్లల రమేష్ నాయుడు, అబ్ధుల్ రహీం, పాలడుగు పరుశరాములు పాల్గొన్నారు.



Next Story