మిడ్జిల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పాండు యాదవ్ ఎన్నిక

by  |
మిడ్జిల్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పాండు యాదవ్ ఎన్నిక
X

దిశ, జడ్చర్ల : మిడ్జిల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి పాండు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా పాండు యాదవ్, ఉపాధ్యక్షుడిగా వెంకట్ సాగర్, శివ ప్రసాద్, కాడాయ్య, ప్రధాన కార్యదర్శిగా జైపాల్ రెడ్డి, అధికార ప్రతినిధిగా శేఖర్ లను ఎన్నుకున్నారు. అలాగే మండల యూత్ అధ్యక్షుడిగా పట్నం బంగారు, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దేవరాజు, బీసీ సెల్ అధ్యక్షుడిగా బొజ్జప్ప, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పవర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అన్వర్, మండల మహిళా అధ్యక్షురాలిగా లక్ష్మీదేవి లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి మండల స్థాయి కమిటీల ద్వారా పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ పథకాలు కిందిస్థాయి ప్రజలకు అందేలా చూడాలన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు సభ్యులు పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు పాండు యాదవ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ ఆదేశాల మేరకు మండలంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నాయకులను కలుపుకొని పార్టీ కార్యకలాపాలు చేపడతారని అన్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మండల నాయకులకు పాండు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు.


Next Story

Most Viewed