పాలక్ కిచిడీ

by  |
పాలక్ కిచిడీ
X

కావలసిన పదార్ధాలు :

బియ్యం- అర కప్పు
పెసరపప్పు- పావు కప్పు
పాలకూర గుజ్జు- ముప్పావు కప్పు
నీళ్లు- రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు
పచ్చిమిర్చి- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్
ఉప్పు- తగినంత
పసుపు- చిటికెడు
కారం- ఒక స్పూన్
ధనియాల పొడి- ఒక స్పూన్
జీలకర్ర పొడి- అర స్పూన్
గరం మసాలా- అర స్పూన్
నెయ్యి- టేబుల్ స్పూన్
మిరియాలు- అర స్పూన్
జీలకర్ర- స్పూన్
ఎండుమిర్చి- ఒకటి

తయారీ విధానం:

బియ్యం, పెసరపప్పును కడిగి రెండిటినీ కలిపి పావుగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసి వేయించాలి. ఐదు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర గుజ్జు, పసుపు, ధనియాలపొడి, జీలకర్ర, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కడిగిన బియ్యం, పెసరపప్పు, రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి.



Next Story