మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో వైరల్.. షాక్‌లో నెటిజన్స్

663
MLA-Video1

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఆ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆ వీడియో నిజమేనా? కాదా? అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. పాక్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. పాకిస్తాన్ తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యేకు చెందిన అశ్లీల వీడియో ఒకటి వెలుగు చూసింది. ఆ వీడియోపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎవరో కావాలనే తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఇలాంటివి చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆ ఆశ్లీల వీడియోలో కనిపిస్తున్నది ఎమ్మెల్యే సానియానే అంటూ కామెంట్లు చేస్తుండగా.. ఆ వీడియోలో కనిపిస్తున్న స్త్రీ సానియానా లేక మరో మహిళనా? అనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, మీడియాలో ఇందుకు సంబంధించి వార్త కథనాలు వచ్చినప్పటి నుంచి సానియాకు అసభ్యకరమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమాచారం.

షాకింగ్‌ న్యూస్.. రాజ్‌కుంద్రా‌తో శిల్పాశెట్టి విడాకులు..?

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..