అయిపాయే.. మళ్లీ సిరిస్ పాక్‌ దే..

414

దిశ, వెబ్ డెస్క్ : బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో సిరీస్‌ను సొంతం చేసుకుంది. షేర్ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో మరోసారి బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడింది. తొలి మ్యాచ్‌ తరహాలోనే బంగ్లాదేశ్ ఏ మాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే టార్గెట్‌ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ గెలుచుకుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..