ఇంగ్లాండ్‌లో పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

by  |
ఇంగ్లాండ్‌లో పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్
X

– ప్రధాని ఇమ్రాన్ ఆమోదం

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పర్యటనపై చర్చించాయి కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతి తీసుకోలేదు. దీంతో కరోనా ముప్పు నేపథ్యంలో ఇంగ్లాండ్ బోర్డు తీసుకుంటున్న చర్యలను పీసీబీ చీఫ్ ఎహసాన్ మణి ప్రధాని ఇమ్రాన్‌కు వివరించారు. దీంతో పాక్ జట్టు పర్యటించేందుకు
ఆమోదముద్ర వేశారు.

కాగా, ఈ పర్యటనలో జట్టు సభ్యుల వెంట కుటుంబ సభ్యులను అనుమతించలేమని, పర్యటన పూర్తయి తిరిగి పాకిస్తాన్ వచ్చేవరకు ఆటగాళ్లు ఒంటరిగానే ఉండాలని పీసీబీ తేల్చి చెప్పింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టీ-20లు జరుగనున్నాయి.

పూర్తి బయోసెక్యూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ద్వైపాక్షిక సిరీస్‌కు ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ ఆటగాళ్లను ఇంగ్లాండ్ తీసుకెళ్లడానికి ఈసీబీ ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసింది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది.



Next Story

Most Viewed