‘పద్మ శ్రీ’ గ్రహితకు ఘన సత్కారం.. అన్నదాతలకు వెంకట్ రెడ్డి ఏం చెప్పారంటే..?

by  |
‘పద్మ శ్రీ’ గ్రహితకు ఘన సత్కారం.. అన్నదాతలకు వెంకట్ రెడ్డి ఏం చెప్పారంటే..?
X

దిశ, అల్వాల్​ : భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ చేతుల మీదుగా రైతు వెంకట్ రెడ్డి ‘పద్మ శ్రీ’ పురస్కారం అందుకోవడం తెలంగాణ రైతాంగానికే గర్వకారణమని అల్వాల్​ కార్పొరేటర్​ శాంతి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. శనివారం ఆయన నివాసంలో స్థానికులతో కలిసి అల్వాల్ వెంకట్​రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో ప్రతీష్టాత్మకమైన పద్మ శ్రీ పురస్కారం అల్వాల్‌కు వాసికి రావడం ఎంతో గర్వకారణం అన్నారు. వెంకట్ రెడ్డి భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం పద్మ శ్రీ గ్రహిత మాట్లాడుతూ.. భూసారాన్ని నాశనం చేస్తున్న కెమికల్​ఎరువుల వాడకాన్ని తగ్గించి మంచి దిగుబడి పౌష్టికాహార ఉత్పత్తులను పెంచే సహజ సిద్ద వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ఆ విధంగానే ప్రభుత్వాలు అన్నదాతలను ప్రోత్సహించాలని వెంకట్​ రెడ్డి కోరారు. లక్షలు వెచ్చించి చేసే ఆధునిక వ్యవసాయం కంటే సహాజ సిద్దమైన వ్యవసాయం ఎంతో లాభదాయకమన్నారు. అందుకు తానే నిదర్శనమని చెప్పారు.

గత 20 ఏళ్లుగా సహజ సిద్ధమైన సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నానని తెలిపారు. ఈ మట్టి మనిషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెంకట్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అల్వాల్​ డివిజన్​ అధ్యక్షుడు ఉదయ్​మార్, మధు, సూర్యకిరణ్, రాజా సింహారెడ్డి, దేవేందర్​ప్రవీణ్, సతీష్​, కవిత, వినోద్, జార్జ్, లోకేష్​ పాల్గొన్నారు.


Next Story

Most Viewed