నిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నా

by  |
నిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నా
X

దిశ, న్యూస్‌బ్యూరో: నిమ్స్ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గురువారం మెరుపు సమ్మె (ధర్నా)కు దిగారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాల పెంపుపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైద్య సిబ్బంది ఆసుపత్రి ఆవరణలోనే ధర్నాకు దిగారు. దీంతో ఉదయం ఔట్ పేషెంట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో మరికొంత ఎక్కువ సంఖ్యలోనే రోగులు వస్తున్నారు. ఈ సమయంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. అప్పటికే వివిధ విభాగాల దగ్గర గంటల తరబడి రోగులు క్యూలో నిల్చున్నారు. డయాలసిస్ రోగులు కూడా బాగా ఇబ్బంది పడ్డారు.

మధ్యాహ్నం వరకూ సిబ్బంది విధుల్లో చేరకపోవడంతో ఓపీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. రోగుల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో ఆయా విభాగాల దగ్గర రద్దీ ఏర్పడింది. సోషల్ డిస్టెన్స్ గాలికెగిరిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాక విధుల్లో ఉన్న సిబ్బందిపై రోగులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కసారిగా రోగులంతా గుమిగూడడం ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా వేతనాల పెంపు అమల్లోకి రాలేదని, సమావేశంలో సానుకూల నిర్ణయం జరిగినా ఆ మేరకు పెరిగిన వేతనాలను యాజమాన్యం చెల్లించడం లేదని, కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వాపోయారు.



Next Story

Most Viewed