మరో వండర్..‘సెక్స్ లేకుండా పిల్లలను కంటున్న జీవి’

by  |

దిశ, ఫీచర్స్ : ఒక జీవి భూమి మీదకు రావాలంటే తల్లిదండ్రులు అవసరం. కేవలం మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లోనూ మెన్ -ఉమెన్ అట్రాక్షన్, సెక్స్, క్రోమో జోమ్స్ రిలీజ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వగలవు. ఇది సృష్టి ధర్మం. కానీ ఓ చిన్న జీవజాతి సెక్స్ లేకుండానే పిల్లలను పునరుత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. సెక్స్ లేకుండానే మిలియన్ సంవత్సరాలు బతకగలవని చెబుతున్నారు కొలోన్ మరియు గుట్టింగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు.

ఒపియెల్లా నోవా అనే పురుగులో మొత్తం స్త్రీ జాతి మాత్రమే ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు సైంటిస్టులు. దీన్ని‘ప్రాచీన అలైంగిక కుంభకోణం (ancient asexual scandal)’గా అభివర్ణించిన శాస్త్రవేత్తలు. సంభోగం లేకుండానే బీటిల్స్‌ను ఎలా పునరుత్పత్తి చేస్తున్నాయో మాత్రం గుర్తించలేకపోయారు. నిగూఢ లైంగిక మార్పిడి కారణమై ఉండొచ్చని భావిస్తున్న సైంటిస్టులు. తమను తాము క్లోనింగ్ చేసుకోవడం వల్ల క్రోమోజోములను రిలీజ్ చేస్తూ రీప్రొడక్షన్ చేస్తున్నాయేమోనని అనుమానిస్తున్నారు.

సాధారణంగా అయితే మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవజాతుల్లోనూ ఆడ మగ ఉంటాయి. వీటిలో ఉన్న రెండు సెట్ల క్రోమోజోములు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఎక్స్‌ఛేంజ్ అయి బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ క్రోమోజోముల ‘మిక్సింగ్’అనేది ఒపియెల్లా నోవా పురుగు జాతిలో లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తమలో తాము క్లోనింగ్ చేసుకుంటూనే జన్యుపరమైన వైవిధ్యాన్ని చూపగలుగుతున్నాయని గుర్తించారు. దీన్ని మెసెల్సన్ ఎఫెక్ట్ అని చెబుతున్న శాస్త్రవేత్తలు. కానీ, ఇప్పటివరకు జంతువులలో ఇలాంటిది చూడలేదనే అంటున్నారు లౌసాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎకాలజీ మరియు ఎవల్యూషన్ విభాగంలో ప్రొఫెసర్ తంజా స్క్వాండర్ చెప్పారు.

Next Story

Most Viewed