పాక్ సంచలన నిర్ణయం.. పూర్తి స్థాయి యుద్ధం ప్రకటన..?

by Malleboina Mahesh |   (  Updated:2025-05-10 01:32:15  IST  )

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి.

పాక్ సంచలన నిర్ణయం.. పూర్తి స్థాయి యుద్ధం ప్రకటన..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఇరు దేశాలు పరస్పర దాడులు (Mutual attacks) చేసుకుంటున్నాయి.ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రత్యక్ష దాడులకు దిగడం‌తో సరిహద్దు ప్రాంతాల్లో బాంబుల మోత మోగుతోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ (Full Scale Military Operation) చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఆ ఆపరేషన్‌కు ‘బన్‌యన్ ఉల్ మర్సూస్‘ (Banyan-Ul-Marsoos) అని శనివారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించారు.

దీంతో నేటి నుంచి పాకిస్థాన్.. భారత్‌పై దాడులను మరింత తీవ్ర తరం చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే, మరికాసేపట్లో భారత ఆర్మీ ప్రెస్‌మీట్ (Indian Army press meet) పెట్టి మరో సంచలన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ (Pakistan) ఇప్పుడు భారత్‌పైకి ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఏకాకిగా మారింది. భారత ఆర్మీ (Indian Army) దాటికి తట్టుకోలేక కకావికలం అవుతుందా.. దాడిని ఎదుర్కొంటుందా వేచి చూడాల్సిందే మరి.

Next Story