- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pakistan: భారత్‌పై పాక్ 'ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్' .. ఈ పేరే ఎందుకు పెట్టారు?

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి ముదురుతున్నాయి. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) దెబ్బకు కకావికలం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ (pakistan army) శనివారం తెల్లవారుజామున సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టిన సైనిక చర్యకు ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ తమ ఆపరేషన్ కు ఆ పేరు ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
పేరులోనే కుట్ర!
ఈ ఆపరేషన్ పేరు వెనుక లోతైన అర్థం ఉన్నదని ఇది ఖురాన్ నుంచి ఒక వచనం ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం బన్యాన్ మార్సూస్ (Operation Bunyan Ul Marsoos) అనేది అరబిక్ పదబంధం. 'చేధించలేని దృఢమైన గోడ (అన్ బ్రేక బుల్ వాల్)' అని అర్థం. 'నిజంగా అల్లాహ్ తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడేవారిని ప్రేమిస్తాడు. వారు దృఢమైన నిర్మాణంలా ఉంటారు' అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న ఒక దుర్భేద్యమైన గోడ లేదా నిర్మాణంగా చిత్రీకరించుకోవాలని కోరుకుంటుందని అలాగే ఈ సైనిక చర్యలకు ఆధ్యాత్మిక కోణాన్ని ఆపాదించే కుట్రలో భాగంగా పాక్ ఈ పేరు పెట్టి ఉంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ వర్సెస్ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్:
పహెల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ దాడిలో 26 మంది పురుషులను ముష్కరులు చంపేశారు. దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వింతతువులు అయ్యారు. దీంతో వారికి న్యాయం చేయాలని, వారికి తమ నుదిటి బొట్టును దూరం చేసిన ఉగ్రవాదులను వేటాడేందుకు ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. దీనికి పోటీగా పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్ చేపట్టడంతో ఈ రెండు ఆపరేషన్ లలో ఎవరిది పై చేయి కాబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పాక్ చర్యలను భారత్ తిప్పి తిప్పి కొడుతోంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ దాదాపు చేతులెత్తేసే పరిస్థితిలో ఉండగా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.