Military Village: ఊరి పేరు మిలటరీ.. ఇంటికొక సైనికుడు.. ఉగ్గుపాలతోనే దేశభక్తిని నూరి పోస్తున్న తల్లులు.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తాం

by Vennela |

Military Village: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో దేశ సైనికులకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంది.

Madhavaram Military Village in Tadepalligudem Mandal West Godavari District telugu news
X

Military Village: ఊరి పేరు మిలటరీ.. ఇంటికొక సైనికుడు.. ఉగ్గుపాలతోనే దేశభక్తిని నూరి పోస్తున్న తల్లులు.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తాం

Military Village: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో దేశ సైనికులకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంది. సైనికులను గౌరవించడం అనేది మన కనీస బాధ్యత. వారు తుపాకీ పట్టుకొని సరిహద్దుల వద్ద నిలబడితేనే మనం ఇక్కడ ఊపిరిపించుకోగలుగుతున్నాం. లేకపోతే విదేశీ శక్తులు మన దేశంలోకి చొరబడి ఈ దేశాన్ని దోచుకొని చిన్నాభిన్నం చేసేవి.

ఉగ్రవాదులు స్వైర విహారం చేసేవారు. అందుకే మన సరిహద్దులను కాపలా కాస్తున్న సైనికులను జై జవాన్ అని గౌరవించాల్సిందే. మన చుట్టుపక్కల ఒక సైనికుడు కనిపిస్తేనే ఎంతో గౌరవిస్తాము. అలాంటిది ఒక గ్రామంలో ఆ ఊరిలో ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. సైన్యంలో చేరడం అనేది కేవలం ఒక ఉపాధి మాత్రమే కాదు ఎంతో త్యాగనిరతి ఉంటేనే సైన్యంలో చేరాలని తపన ఉంటుంది.

ఉగ్గుపాలతోనే దేశభక్తిని నూరిపోసిన పిల్లలు మాత్రమే సైన్యంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. అలా ఉగ్గుపాలతో దేశభక్తిని నూరిపోసిన గ్రామమే మిలటరీ మాధవరం. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం. దేశంలోని త్రివిధ దళాలకు అత్యధిక మంది సైనికులను అందించి ‘మిలటరీ మాధవరం’గా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం మట్టిలోనే పోరాడే తత్వం ఉంది ఈ గ్రామం నుంచి ఏకంగా 2000 మంది ఇండియా పాకిస్తాన్ తలపడిన రెండు యుద్ధాలలో పాల్గొన్నారు.

ప్రస్తుతం కూడా సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఈ గ్రామస్తులు సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామం నుంచి మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కూడా సైనికులు భారత సైన్యంలో చేరుతున్నారు. 1915లోనే మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 90 మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్లి పోరాటం చేశారు. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో ఏకంగా 1100 మంది యుద్ధంలో పోరాటం చేశారు.

1962 చైనా యుద్ధంలో 850 మంది, 1965 పాకిస్థాన్ యుద్ధంలో 900 మంది, 1971 లో 950 మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్లి యుద్ధం చేశారు. ఈ గ్రామంలో చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్ నివాసం ఉంటున్నారు. వీరంతా మరోసారి పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటామని, సైన్యం పిలుపు ఇస్తే చాలు తాము సిద్ధమని పేర్కొంటున్నారు.


Next Story