- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన యూకే మాజీ ప్రధాని Rishi Sunak
పాకిస్తాన్ ఉగ్రవాదులపై మంగళవారం అర్ధరాత్రి భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్ సిందూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులపై మంగళవారం అర్ధరాత్రి భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్ సిందూర్ పేరుతో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని 9 ప్రాంతాల్లో ఈ దాడులు జరగ్గా 90 మంది ఉగ్రవాదులు మృతి చెందగా మరో 50 మంది వరకు గాయాలపాలై నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని భారత్ చేసిన ఈ దాడికి పలు దేశాలు మద్దతు తెలుపగా మరికొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యూకే మాజీ ప్రధాని రిషి సునక్ (Former UK Prime Minister Rishi Sunak) ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ కీలక ట్వీట్ చేశారు. అందులో " ఏ దేశం కూడా మరొక దేశం నియంత్రణలో ఉన్న భూభాగం నుండి తమపై ఉగ్రవాద దాడులు జరగడాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు.
ఉగ్రవాద మౌలిక సదుపాయాల పై భారతదేశం దాడి చేయడం సమర్థనీయమే. ఉగ్రవాదులకు శిక్ష నుండి ఎటువంటి మినహాయింపు ఉండదు." అని రాసుకొచ్చారు. అంతకు ముందు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై UK ఆందోళన వ్యక్తం చేసింది. "ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వేగవంతమైన, దౌత్య మార్గాన్ని కనుగొనడానికి భారతదేశం, పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని, ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని UK ప్రభుత్వం కోరుతోంది" అని UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ అన్నారు.






