దుర్గమ్మ దర్శనానికి ఆన్‌లైన్ టోకెన్లు బంద్

85

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో విజయవాడ దుర్గగుడి ఈవో భ్రమరాంబ కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్శనానికి ఆన్‌లైన్ టోకెన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మవారిని దర్శించుకోవాలంటే నేరుగా క్యూలైన్లలోకి వెళ్లి దర్శించుకోవాలని తెలిపారు. క్యూలైన్ల వద్దనే రూ.100, రూ.300 టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు.

కాగా, అవినీతి ఆరోపణలతో దుర్గగుడి ఈవోగా ఉన్న సురేష్ బాబును ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో భ్రమరాంబ కొత్త ఈవోగా వచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..