'ఒలింపిక్స్ వాయిదా సరైన నిర్ణయమే'

by  |
ఒలింపిక్స్ వాయిదా సరైన నిర్ణయమే
X

కరోనా భయాందోళనల నేపథ్యంలో ఈ ఏడాది టోక్యోలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా వేస్తూ జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సమయంలో ఒలింపిక్స్ వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని భారత బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా కరోనా భయంతో ఉన్న సమయంలో క్రీడల గురించి ఆలోచించడం వల్ల ఆటగాళ్ళు, సహాయక సిబ్బందిలో ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు.

ఒలింపిక్స్ వాయిదా వేయడంలో ఇప్పటి వరకు తాత్సరం చేసినా, చివరకు మంచి నిర్ణయమే తీసుకున్నారని అన్నారు.

క్రీడలు వాయిదా వేయడం వల్ల ఆటగాళ్లకు మంచి సమయం దొరికిందని.. ఇప్పుడు మరింత సాధన చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాగా, బ్యాడ్మింటన్ విభాగంలో ఇంకా అర్హత అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. బీడబ్ల్యూఎఫ్ కూడా ప్రస్తుతానికి ర్యాంకింగ్స్ నిలిపేసే ఆలోచనలో ఉంది. అర్హత టోర్నమెంట్లు రద్దు కావడంతో.. తిరిగి వాటిని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొందని గోపీచంద్ అన్నారు.

ఒలింపిక్స్ అర్హత విషయంలో అన్యాయం జరుగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని గోపీ కోరారు. అర్హతకు సంబంధించి రద్దయిన పలు టోర్నీలను తిరిగి నిర్వహించాల్సిన అవసరం ఉందని గోపీ అభిప్రాయపడ్డాడు.

Tags: Olympics, Tokyo, Badminton Coach, Gopichand, Rankings, Qualify

Next Story

Most Viewed