కొవిడ్‌ కట్టడికి అమెరికన్ల ‘బ్లీచ్’ మంత్రం

by  |
కొవిడ్‌ కట్టడికి అమెరికన్ల ‘బ్లీచ్’ మంత్రం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలంతా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలితాలింకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి రాక వైరస్ రోజురోజుకూ విస్తృతమవుతూ ప్రజలను కలవరపెడుతోంది. ఇక అమెరికాలో అయితే కరోనా కరాళనృత్యం చేస్తోందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో కరోనాను నిరోధించేందుకు అమెరికా ప్రజలు రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ ఇటీవలే చేసిన సర్వేల ప్రకారం అమెరికన్ల తీరుపై షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

హౌజ్‌హోల్డ్ క్లీనింగ్ ఏజెంట్ బ్లీచ్‌కు సంబంధించిన కొనుగోళ్లు ఏప్రిల్ నెలలో అమెరికాలో విపరీతంగా పెరిగాయి. దీన్నిగమనించిన పాయిజన్ కంట్రోల్ సెంటర్.. వెంటనే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ)కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీంతో ఆ ఏజెన్సీ ఆన్‌లైన్ సర్వే చేపట్టగా.. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు చాలా మంది అమెరికన్లు బ్లీచ్‌ను గార్గిలింగ్ చేస్తున్నారని, డిస్ఇన్‌ఫెక్ట్ ఫ్యూమ్స్‌ను ఇన్‌హేల్ చేస్తున్నారనే విషయాలు తెలిశాయి.

సీడీసీ సర్వే ప్రకారం.. కొవిడ్ భయం వల్ల నీట్‌నెస్ పెరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో.. 60 శాతం మంది అమెరికన్లు ఫ్రీక్వెంట్‌గా హోమ్ క్లీన్ చేస్తున్నారు. 19 శాతం మంది పండ్లు, కూరగాయాలు, ఇతర ఫుడ్, గ్రాసరీ ఐటెమ్స్‌ను బ్లీచ్‌లో కడుగుతున్నారు. 18 శాతం మంది సబ్బుకు బదులుగా టాక్సిక్ క్లీనర్స్‌తో చేతులు కడుక్కుంటున్నారు. మరో 10 శాతం మంది బ్లీచ్ లేదా డిస్ఇన్‌ఫెక్టెంట్స్‌ను మీద చల్లుకుంటున్నారు. 6 శాతం మంది బ్లీచ్ లేదా ఇతర హౌజ్ హోమ్ క్లీనర్స్‌ను ఇన్‌హేల్ చేశారు. 4 శాతం అమెరికన్లు.. సోప్ సొల్యూషన్స్, హౌజ్‌హోల్డ్ క్లీనర్స్, బ్లీచ్ వంటి వాటితో గార్గిలింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటివి చేయడం వల్ల 25శాతం మంది అమెరికన్లు.. స్కిన్ ఇరిటేషన్, మత్తు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటుండటం గమనార్హం.

Next Story