యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు : ఎన్‌పీసీఐ!

by  |
యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు : ఎన్‌పీసీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ చెల్లింపుల యాప్‌ల నుంచి వినియోగదారులు చేసే చెల్లింపులపై అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయటంలేదని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. ఇటీవల జనవరి 1 నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు మీడియా వర్గాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఎన్‌పీసీఐ శుక్రవారం ప్రత్యేక ప్రకటన ఇచ్చింది. 2008లో ఎన్‌పీసీఐ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ చెల్లింపులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూపీఐ ద్వారా నగదు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడంలేదు.

Next Story