కరోనా వల్ల భారీగా డిజిటలైజేషన్ వృద్ధి!

by  |
కరోనా వల్ల భారీగా డిజిటలైజేషన్ వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్‌లో డిజిటలైజేషన్ వేగవంతగా మారిపోయిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభిప్రాయపడింది. దీనికి ప్రధానంగా ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సంబంధిత పరిణామాలతో అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ భాగమైపోయిందన్నారు. భవిష్యత్తులో పూర్తిగా ఈ విధానం సాధారణమైపోతుందని, నగదు చెల్లింపుల నుంచి పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపులకు మారిపోతాయని ప్రవీణా రాయ్ తెలిపారు.

వ్యాపారులు సహా ప్రజలు డిజిటల్ విధానానికి మరలుతున్నారని, అంతేకాకుండా క్యూఆర్ కోడ్ వినియోగం ద్వారా యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయన్నారు. ఇప్పుడే కాకుండా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగంతో చెల్లింపుల్లో ఉత్పన్నమయ్యే సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కారమవుతాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా ప్రజలు డిజిటలైజేషన్ విధానం వల్ల పొదుపు చేయగలుగుతున్నారని, అందరి జీవితాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుందని వెల్లడించారు.


Next Story

Most Viewed