నిజామాబాద్ జిల్లాలో 6 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా బారినపడిన చాలా మంది చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులను దోచుకుంటున్నాయి. చికిత్స పేరుతో ఆసుపత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అటువంటి ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని 6 ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆరోపణల కారణంగా ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు.

ఆరు ఆసుపత్రుల వివరాలు..

1. రాజేష్ కొవిడ్ సెంటర్,
2. ఇండస్ ఆసుపత్రి,
3. శశాంక్ ఆసుపత్రి,
4. వేదంష్ ఆసుపత్రి,
5. అన్షుల్ ఆసుపత్రి,
6. శ్రీ లైఫ్ గాయత్రి ఆసుపత్రి.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed