ఉత్తర కొరియా ‘కిమ్’ అరాచకం.. ఆ వెబ్ సిరీస్ చూశారని కాల్చి చంపారు.!

by  |
ఉత్తర కొరియా ‘కిమ్’ అరాచకం.. ఆ వెబ్ సిరీస్ చూశారని కాల్చి చంపారు.!
X

దిశ, సినిమా: తన మాటే శాసనంగా పాలన సాగిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరో సంచలన నిర్ణయంతో హాట్ టాపిక్‌గా మారాడు. పెట్టుబడిదారి వ్యవస్థను, దాని క్రూరత్వాన్ని ప్రజలకు క్షుణ్ణంగా చూపిస్తుందని నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’‌ను ఆ దేశంలో బహిష్కరించిన కిమ్.. ఓ విద్యార్థి రహస్యంగా ఆ సిరీస్ చూశాడని సైన్యంతో కాల్చి చంపించాడు. ఉత్తర కొరియా కల్చర్‌కు పూర్తి విరుద్ధంగా ఉన్న సిరీస్‌ను చైనా సర్వర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసిన యువకుడు.. తన మిత్రులకు కూడా షేర్ చేశాడు.

అంతేకాదు స్కూల్‌లో విద్యార్థులు ఈ సిరీస్ చూశారని.. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌, టీచర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఇప్పటికే ఆ సిరీస్‌ను నిషేధిస్తున్నామని ప్రకటించినా.. తమ మాట వినకుండా ప్రవర్తించిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఈ పని ఎవరు చేసినా అదే శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాగా ఉత్తర కొరియా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్యాపిటలిస్ట్‌ దేశాల ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాల్ని చూసినా.. వాటి కాపీలు కొన్నా.. షేర్ చేసినా.. కఠిన శిక్ష తప్పదు.



Next Story