ఒకటి సరిపోదు.. రెండు మాస్కులు పెట్టండి

by  |
double mask
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అందరూ కరోనాను బారినుండి తప్పించుకోవడానికి వ్యక్తిగతంగా పాటించాల్సిన కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా మాస్కును అనివార్యంగా వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాస్కులపై నార్త్ కరోలినా హెల్త్ కేర్ తాజాగా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో కరోనా కట్టడికి ఒక మాస్కు సరిపోదని, డబుల్ మాస్కులు ధరించాలని నిపుణులు వెల్లడించారు. డబుల్ మాస్కులతో వైరస్ కణాలు ప్రవేశించలేవని సైంటిస్టులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed